కానిస్టేబుల్‌ను కారుపై 2.5 కి.మీ ఈడ్చుకుంటూ... - రోహిత్
🎬 Watch Now: Feature Video
హరియాణా గురుగ్రామ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆగస్టు 18న రాత్రి సెక్టార్-7 ప్రాంతంలో గస్తీ విధులు నిర్వహిస్తున్నాడు కానిస్టేబుల్ రోహిత్. అదే సమయంలో వేగంగా వచ్చిందో కారు. ఆపడానికి ప్రయత్నించగా.. కారు అతడి మీదకు దూసుకెళ్లింది. కానిస్టేబుల్ కారుపై పడిపోయాడు. పట్టించుకోని డ్రైవర్... అలాగే రెండున్నర కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. అనంతరం.. కొద్దిగా వేగం తగ్గిన సమయంలో దూకి ప్రాణాలు రక్షించుకున్నాడా పోలీస్. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు.
Last Updated : Sep 27, 2019, 7:04 PM IST