సినిమాను తలపించేలా మాఫియా గ్రూప్‌ల గన్ ఫైట్.. ఇద్దరు మృతి - ఇసుక మాఫియా
🎬 Watch Now: Feature Video
Gun fight: బిహార్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయారు. సినిమాను తలపించేలా తూటాలా వర్షం కురిపించుకున్నారు. భోజ్‌పుర్ జిల్లాలోని రాజ్‌పుర్ దియారా కోయిల్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ గన్ ఫైట్‌లో ఓ బ్యాంకు ఉద్యోగి సహా ఇద్దరు మృతి చెందారు. కమలుద్దీన్ చాక్ ఇసుక ఘాట్ వద్ద శనివారం రెండు గ్రూపులు నాటు తుపాకులతో తలపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అందులోని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.