కరోనా నిబంధనలు మరిచి.. గుంపులు గుంపులుగా.. - corona in bangalore graph during festivals
🎬 Watch Now: Feature Video
పండుగ సీజన్లో కరోనా వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు స్పష్టం చేశాయి. కానీ దీపావళి నేపథ్యంలో బెంగళూరు ప్రజలు కరోనా నిబంధనలను పూర్తిగా విస్మరించి గుంపులు, గుంపులుగా కనిపిస్తున్నారు. పండుగ సామగ్రిని కొనేందుకు బయటకు వచ్చిన జనం భౌతికదూరాన్ని మరిచిపోయారు. నిత్యావసరాలు కొనేందుకు వచ్చిన వారితో నగరంలోని కేఆర్ మార్కెట్ ఇలా జనసందోహంగా మారింది.