జానపద గాయకుడి ఇంట్లో అమిత్ షా విందు
🎬 Watch Now: Feature Video
బంగాల్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఓ జానపద గాయకుడి ఇంట్లో భోజనం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీర్భమ్ జిల్లాలోని బోల్పుర్లో వసుదేవ్ దాస్ బౌల్ ఇంట్లో బెంగాలీ విందు ఆరగించారు. మంత్రితో పాటు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ముకుల్ రాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బౌల్, అతని కుటుంబ సభ్యులు ఓ జానపద గేయాన్ని పాడగా.. ఎంతో ఆసక్తిగా ఆలకించారు షా.