విమానంలో పావురం.. ఇక అంతా గందరగోళం - విమానంలో పావురం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6244577-355-6244577-1582960515831.jpg)
అహ్మదాబాద్ నుంచి జైపూర్‌కు వస్తోన్న జీ 8-702 గో ఎయిర్ ఫ్లైట్ విమానంలోకి అనుకోకుండా ఓ పావురం ప్రవేశించింది. విమానం లోపల పక్షి ఎగరడం వల్ల ప్రయాణికులు, సిబ్బంది కాస్త ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు విమానం తలుపులను తెరిచిన తర్వాత పావురం బయటికి వెళ్లింది. ఫలితంగా 5.45 గంటలకు జైపూర్‌కు చేరుకోవాల్సిన విమానం.. 6.15 గంటలకు వెళ్లింది. ఈ దృశ్యాలను ప్రయాణికులు తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
Last Updated : Mar 2, 2020, 11:04 PM IST