పాముతో వృద్ధుడి దుస్సాహసం.. చివరకు.. - పాము కాటు
🎬 Watch Now: Feature Video
ఓ వృద్ధుడి దుస్సాహసం అతడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. గ్రామస్థులు హెచ్చరిస్తున్నా వినకుండా పామును చేతితో పట్టుకుని ఆటలాడిన డేగ్లాల్ అనే గ్రామస్థుడు పాముకాటుతో మరణించాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగింది. డేగ్లాల్కు తరచూ పాములను పట్టి వాటితో ఆటలాడటం అలవాటు అని గ్రామస్థులు తెలిపారు. అయితే, ఆదివారం జరిగిన ఘటనలో డేగ్లాల్.. మద్యంమత్తులో ఆ 7 అడుగుల పాము విషపూరితమో కాదో తెలుసుకోలేకపోయాడని పేర్కొన్నారు. తాము హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదని తెలిపారు.