కరెంట్ బిల్లు చెల్లించలేదని.. చీపురుతో.. - కర్ణాటకలో కరెంట్ బిల్లు కట్టలేదని సిబ్బంది దాడి
🎬 Watch Now: Feature Video

కరెంట్ బిల్లు చెల్లించలేదనే కారణంతో ఓ వ్యక్తిని విద్యుత్ శాఖ సిబ్బంది చీపురుతో కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. బెళగావి జిల్లా రాయ్‌బాగ తాలూకా బిరాడీ గ్రామంలో అప్పాసాబ్ మకానీ అనే వ్యక్తి గత సంవత్సర కాలంగా కరెంట్ బిల్లు చెల్లించడం లేదు. దీంతో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ సిబ్బంది అప్పాసాబ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అప్పాసాబ్‌కు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగ్గా.. విద్యుత్ సిబ్బంది అప్పాసాబ్‌పై చీపురుతో దాడి చేశారు. స్థానికులు వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.