Viral: కదులుతున్న రైలును ఎక్కబోయి... - ముంబయిలో రైలు నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12055801-thumbnail-3x2-img.jpg)
ముంబయిలో ఓ రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తత.. ఓ నిండుప్రాణాన్ని కాపాడింది. కుర్లా రైలు స్టేషన్లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నంలో పట్టుతప్పిపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్.. బాధితుడిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లాట్‌ఫాంపైకి లాగాడు. లేకుంటే అతని ప్రాణాలు ప్రమాదంలో పడి ఉండేవని తోటి ప్రయాణికులు తెలిపారు. ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీలో నిక్షిప్తమయ్యాయి.