ఒకే చోట 98 పాములు.. జనం హడల్ - గుట్టలకొద్దీ బయటపడ్డ పాములు
🎬 Watch Now: Feature Video
సాధారణంగా ఒకటీ రెండూ పాములు కనపడితేనే హడలిపోతాం. అలాంటిది వంద సర్పాలు ఒకే చోట దర్శనమిస్తే.. గుండె గుబేలే ఇక. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని వర్ధా జిల్లాలో జరిగింది. అర్వి ప్రాంతంలో ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా బాత్రూమ్ కట్టే సమయంలో.. రెండు నీళ్ల డ్రమ్ముల కింద నుంచి 98 పాములు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు అక్కడివారు. అయితే అవన్నీ విషంలేని పాములు కావడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. అటవీ అధికారులు సమాచారం అందించగా.. వారు వాటిని ఓ రిజర్వ్ ఫారెస్టులో వదిలేశారు.