20వేలకుపైగా మొక్కలతో గాంధీజీ ఆకృతి! - స్వాతంత్ర్య దినోత్సవం
🎬 Watch Now: Feature Video
20వేలకు పైగా మొక్కలతో మహాత్మ గాంధీ ఆకృతిని రూపొందించారు మధ్యప్రదేశ్లోని రజత్ గధేవాల్ అనే కళాకారుడు. ఛింద్వాడాలోని ప్రైవేట్ పాఠశాలలో మరో 12మందితో కలిసి ఈ కళాకృతిని తీర్చిదిద్దారు. బాపూజీ ఆలోచనలను ప్రజలకు చేరువ చేయడం కోసమే దీనిని రూపకల్పన చేసినట్లు రజత్ తెలిపారు. ఈ ఆకృతికి ప్రపంచ రికార్డు సంపాదించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.