పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు.. 21 బోగీలు చెల్లాచెదురు - రైలు ప్రమాదాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 11, 2021, 2:03 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌ జాన్​పుర్​లోని బద్లాపుర్​-శ్రీ కృష్ణా నగర్​ స్టేషన్ మార్గంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం సుమారు 7.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 21 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా సమయంలో వచ్చిన భారీ శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.