కాంక్రీట్ మిక్సర్ ట్యాంక్‌లో 18 మంది కూలీల ప్రయాణం - migrant workers in mixer tank found at Indore
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7029377-thumbnail-3x2-truck.jpg)
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కరాణంగా ఎక్కడి వలస కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తినడానికి తిండి, చేతిలో డబ్బులు, చేయడానికి పని దొరక్క ఎంతో మంది సొంతూళ్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చూస్తున్నారు. కానీ రవాణా ఆంక్షలు ఉన్నందున.. పోలీసులు ప్రయాణికుల వాహనాలను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చిక్కుకున్న 18 మంది వలస కూలీలు కాంక్రీట్ మిక్సర్ ట్యాంకర్లో లఖ్‌నవూకు బయలుదేరారు. ఇండోర్‌లో పోలీసుల కంటపడ్డారు. అధికారులు వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. ఎఫ్ఐర్ నమోదు చేశారు.
Last Updated : May 2, 2020, 2:56 PM IST