14 అడుగుల కింగ్ కోబ్రా.. 2.5 నిమిషాల హైటెన్షన్.. చివరకు... - king cobra video
🎬 Watch Now: Feature Video

కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో 14 అడుగుల పొడవు, 9.5 కిలోల బరువున్న కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి జాగ్రత్తగా పట్టుకున్నాడు. కుమట మండలం మస్టిహళ్ల గ్రామంలోని గణపు గౌడ పొలం దగ్గర వారం రోజులుగా ఈ భారీ సర్పం కనిపిస్తోంది. అతడి ఇల్లు కూడా అక్కడే ఉన్నందున.. భయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు పాములు పట్టే నిపుణుడు పవన్ నాయికాను తీసుకొచ్చారు. పట్టుకునే సమయంలో కింగ్ కోబ్రా కాటేసేందుకు యత్నించినా.. పవన్ చాకచక్యంగా రెండున్నర నిమిషాల్లోనే ఆ సర్పాన్ని ఓ సంచిలో బంధించాడు. తర్వాత దేవిమనఘట్ట అడవిలో విడిచిపెట్టాడు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST