మ్యూజిక్ వింటూ స్కూల్ వ్యాన్ డ్రైవింగ్.. 19మంది పిల్లలకు గాయాలు - Ujjain Road Accident
🎬 Watch Now: Feature Video
Ujjain Road Accident: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 21 మంది బడిపిల్లలతో ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 19 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అందరూ చికిత్స పొందుతున్నారు. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా.. జిల్లాలోని దేవాస్ రోడ్డులో ఛందేసర గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే కారణమని తెలుస్తోంది. డ్రైవర్ మ్యూజిక్ వింటూ వాహనం నడిపాడని పిల్లలు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST