బ్రిడ్జిపైనుంచి దూకిన పేషెంట్​.. పోలీసులు ఎలా కాపాడారంటే..? - రాయ్​పుర్​లో మానసిక రోగి హల్​చల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 5, 2022, 7:38 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

తనకు సరిగ్గా చికిత్స అందడం లేదంటూ ఓ మానసిక రోగి హల్​చల్ చేశాడు. అంబేడ్కర్​ ఆసుపత్రి ముందున్న బ్రిడ్జిపైకి ఎక్కి రోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఆ మానసిత రోగి ఎవరి మాట వినకుండా బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. రోగి కిందకి దూకేటప్పుడు పోలీసులు వలను పెట్టి కాపాడారు. స్వల్ప గాయాలతో రోగి ప్రాణాలతో బయటపడగా.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మానసిక రోగిని మధ్యప్రదేశ్​కు చెందిన సుజిత్ సాకేత్​గా గుర్తించారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో మంగళవారం జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.