Cherlapally Railway Terminal : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రైళ్ల రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించింది. ఎన్నో హంగులతో ఒక మినీ విమానాశ్రయాన్ని తలపించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేశారు. దీంతో ప్రయాణికులు ఇక నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్లవలసిన అవసరం లేకుండా చర్లపల్లి టెర్మినల్ నుంచే కొన్ని రూట్లలో వెళ్లే రైళ్ల రాకపోకలు సాగేలా చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రయాణికులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులను కొత్తగా ప్రారంభమైన టర్మినల్ ప్రధాన ద్వారం వైపు 400 మీటర్ల దూరంలోనే నిలిపి వేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు నడక తప్పడం లేదు.
క్యాబ్‌లకు మాత్రం ఎంట్రీ : ఆ బస్సు స్టాప్ నుంచి నడుచుకుని వెళ్లి బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ తీసుకొని అక్కడి నుంచి ప్లాట్‌ఫాం వైపు వెళ్లేందుకు 15 నిమిషాల సమయం పడుతోంది. దీంతో ప్రయాణికులకు ప్రయాస తప్పడం లేదు. ఆర్టీసీ బస్సులకు పరిమితులు విధించి, క్యాబ్‌లను ప్రధాన ద్వారం వద్ద నిలిపేలా అనుమతులు ఇవ్వడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రయాణికులు బస్సులను టెర్మినల్ వరకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాలమైన స్థలం ఉన్నా నో పర్మిషన్ : ప్లాట్‌ఫామ్ 9 మార్గంలో చెంగిచెర్ల, ఉప్పల్, రామంతాపూర్ నుంచి బోరబండ వరకు ప్రతి 40 నిమిషాలకో బస్సు ఉంటుంది. ప్రధాన ద్వారం నిర్మించిన ప్రాంతంలో విశాలమైన స్థలం ఉన్నా స్టేషన్‌కు మాత్రం అల్లంత దూరంలోనే బస్సులను ఆపేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాత మార్గం వైపు : పాత మార్గం మీదుగా స్టేషన్‌కు చేరుకునే ప్రయాణికులకు అనువుగా ప్లాట్‌ఫామ్ నెంబరు 1,2లను ఎంఎంటీఎస్ రైళ్ల నిలుపుదలకు కేటాయించారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు సరైన సదుపాయాలు లేకపోవడంతో ఈ మార్గంలో 100 మీటర్ల దూరంలో ఆర్టీసీ బస్సులను నిలుపుతున్నారు. అయినా ఇక్కడ రహదారి విస్తీర్ణం తక్కువగా ఉండటంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. త్వరలో రైళ్ల సంఖ్య పెరగనున్న తరుణంలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. అప్పుడు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - త్వరలోనే చర్లపల్లి నుంచి మరో 8 రైళ్ల పరుగులు
రైల్వే టెర్మినలా? - ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా! - 28న 'చర్లపల్లి' ప్రారంభం