కారు విషయంలో గొడవ నడిరోడ్డుపై భార్యాభర్తలను చితకబాదిన యువకులు - జైపుర్ యువకుల దాడి
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్‌లోని జైపుర్‌లో జరిగిన ఓ గొడవలో కొందరు యువకులు గర్భిణి అని కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. అక్టోబర్ 25న సతీశ్ అనే వ్యక్తి గర్భిణి అయిన తన భార్య, కుమార్తెతో కలిసి కారులో డిన్నర్‌కు వెళ్లారు. అనంతరం వారు తిరిగి వస్తుండగా సతీశ్ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ విషయంలో సతీశ్ కుటుంబానికి, కారులో ఉన్న యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన యువకులు ఆ భార్యాభర్తలతో పాటు చిన్నారిపై కూడా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నామన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST