స్టేజీపైనే గుండెపోటుతో కళాకారుడు మృతి - కర్ణాటక యక్షగాన కళాకారుడు గుండెపోటు వీడియో
🎬 Watch Now: Feature Video
కర్ణాటక మంగళూరు సమీపంలో యక్షగాన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. శిశుపాలుడి వేషంలో ఉన్న కటీల్ మేళా కళాకారుడు గుండెపోటుతో మరణించాడు. గురువారం కటిలిన క్షేత్రంలోని సరస్వతీ సదన్‌లో త్రిజన్మ మోక్ష యక్షగానం జరిగింది. ఈ సందర్భంగా శిశుపాలుడు పాత్రధారి అయిన 58 ఏళ్ల గురువప్ప బయ్యరుకు వేదికపై ఉండగా గుండెపోటు వచ్చింది. స్టేజీపైనే కుప్పకూలిన అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తర్వాత మంగళూరు తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువప్ప మృతి చెందాడు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST