చుట్టూ అంతమంది ఉన్నా 10లక్షల నెక్లెస్ కొట్టేసిన మహిళ - దుకాణం చోరీకి పాల్పడిన మహిళ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 25, 2022, 4:50 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళ పట్టపగలే దొంగతనానికి పాల్పడింది. గోరఖ్​పుర్​​ జాతేపుర్​ ప్రాంతంలోని బల్‌దేవ్ ప్లాజాలో ఉన్న​ ఓ జ్యూవెలరీ షాప్​లో ఖరీదైన బంగారు నెక్లెస్​ను చోరీచేసింది. దాని విలువ రూ.10 లక్షలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. నవంబర్​ 17న బల్దేవ్​ ప్లాజాలోని ఓ దుకాణంలో ఈ ఘటన జరిగింది. షాపు యజమాని ముందుగా ఇది సిబ్బంది పనే అనుకున్నారు. కానీ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆకుపచ్చ చీర కట్టుకున్న ఓ మహిళ సిబ్బందిని మాటల్లో పెట్టి నెక్లెస్​లను చూస్తూ అందులో ఒకదాన్ని దొంగలించింది. ఆ తర్వాత తనకు అవి నచ్చలేదని అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ దొంగతనంపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.