భార్య పుట్టింటికి వెళ్లిందని పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న భర్త - bihar news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17311947-thumbnail-3x2-suicide.jpg)
భార్య పుట్టింటికి వెళ్లిందని ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన బిహార్‌లోని వైశాలిలో జరిగింది. బాధితుడు మద్యపానానికి అలవాటు పడి తీవ్రంగా వేధించడం వల్ల భార్య అతడిని వదిలిపెట్టి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన భర్త రమేష్ రోడ్డుపైనే పెట్రోల్ పోసుకుని అత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడిన రమేష్ రాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ప్రథమ చికిత్స అనంతరం పట్నా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST