తీగల వంతెనపై కారు నడిపిన పర్యటకులు - కర్ణాటకలో తీగలవంతెనపై పర్యటకుల కారు డ్రైవింగ్
🎬 Watch Now: Feature Video
గుజరాత్ మోర్బీ తీగల వంతెన కూలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం మరువక ముందే కర్ణాటకలో పర్యటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర తీగల వంతెనపై ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పర్యటకులు కాళీ నదిపై ఉన్న తీగల వంతెనపై కారు నడిపారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును వంతెనపై కొంతదూరం తీసుకొచ్చారు. స్థానికులు గట్టిగా అభ్యంతరం చెప్పగా టూరిస్టులు కారును వెనక్కి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST