పైన మంచు.. కింద వర్షం.. శ్రీనగర్‌లో భారీగా హిమపాతం.. విమానాశ్రయం మూసివేత - కశ్మీర్లో మంచు వర్షం
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు, వర్షం పడుతోంది. దీంతో శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను రద్దు చేశారు. గుల్‌మార్గ్‌లోని స్కీ రిసార్ట్, పహల్గాం, సోనంమార్గ్ హిమపాతం మొదలైంది. ఇక శ్రీనగర్ ఎగువ ప్రాంతాల్లో మంచుపడుతుండగా.. దిగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శ్రీనగర్, జమ్ము మార్గం ప్రమాదకరంగా మారడం వల్ల మూసివేశారు. రాంబన్ జిల్లాలోని మెహర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. రోడ్డు మార్గాలపై ప్రయాణించడాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. 10 జిల్లాల్లో హిమపాతం హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. గురువారం సోనమ్ మార్గ్‌లో మంచుపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఇక ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయాయి. శ్రీనగర్, క్వాజీగుండ్, కొక్రెనాగ్, దక్షిణ కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో గురువారం రాత్రి -0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.