ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు, ఒకే కుటుంబంలో నలుగురు మృతి - uttarakhand rains

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 22, 2022, 11:34 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

ఉత్తరాఖండ్​లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడడం వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి. చమోలీ జిల్లాలోని పైన్​గర్​ గ్రామంలో శనివారం ఉదయం ఒక్కసారి కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో మూడు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్​ఎఫ్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 12 ఏళ్ల బాలిక గాయాలతో బయటపడింది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.