వేగంగా దూసుకొచ్చి నలుగురు విద్యార్థినులను ఢీకొట్టిన కారు - వెనక నుంచి వచ్చి విద్యార్థినిల ఢీకొట్టిన కారు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 21, 2022, 10:36 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ఒడిశా గంజాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్​ను నడిపించుకుంటూ రోడ్డుపై వెళ్తున్న నలుగురు బాలికలను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థినులు రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పురుషోత్తం పోలీస్ స్టేషన్​ పరిధిలో ఆదివారం జరిగిందీ ఘటన. ఈ ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.