జీవితం వన్‌వే ట్రాఫిక్ అంటూ పిల్లలకు రాష్ట్రపతి పాఠాలు - రాష్ట్రపతి భవన్లో బాలల దినోత్సవ వేడుకలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16926211-thumbnail-3x2-murmu.jpg)
బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముచ్చటించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో చిన్నారులతో ఆమె మమేకమయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. జీవితం వన్‌వే ట్రాఫిక్ లాంటిదని ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు ముర్ము. ఎటువంటి సౌకర్యాలు లేకుండానే తన విద్యాభ్యాసం సాగిందని ఆమె విద్యార్థులకు తెలిపారు. అలాగే తాను ఉపాధ్యాయురాలిగానూ పనిచేశానని ముర్ము అన్నారు. మీకు ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారని ఓ విద్యార్థిని రాష్ట్రపతి అడిగారు. అందుకు సమాధానంగా ఆ విద్యార్థి చెడుకు వ్యతిరేకంగా నిలబడతానని అన్నాడు. దేశానికి మేలు చేసే పనులు చేస్తానని చెప్పాడు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST