రోడ్డు దాటేందుకు జేసీబీ.. సీఎం సొంత నియోజకవర్గంలోనే - జేసీబీతో రోడ్డు దాటుతున్న ప్రజలు
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో వాగులు పొంగిపోర్లతుండగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సిరాజ్‌లోని బలిచౌకి ప్రాంతంలో రోడ్డు దాటాడానికి జేసీబీని ఉపయోగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వర్షం రావడం వల్ల వాగు ఒక్కసారిగా ఉప్పొంగి నీరు రోడ్డు పైకి వచ్చింది. దీంతో జేసీబీ సహాయంతో రోడ్డును దాటుతున్నారు ప్రజలు. ఇక్కడ వంతెన నిర్మాణం ప్రారంభమైనా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST