రన్నింగ్ ట్రైన్​ ట్యాంకర్ల​ నుంచి రూ.లక్షలు విలువైన ఆయిల్​ చోరీ - బిహార్​ ఆయిల్​ చోరీ కేసు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 6, 2022, 12:51 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

బిహార్​లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న ట్యాంకర్స్​​ నుంచి ఆయిల్​ చోరీకి పాల్పడుతున్నారు. పట్నా జిల్లా బిహ్​టా ప్రాంతంలోని నాగాజీ వంతెనపై కదులుతున్న ట్రైన్​​ ట్యాంకర్​లలో ఈ చోరీ జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా బిహ్​టాలోని హెచ్​పీసీఎల్​ కంపెనీ వివిధ ప్రాంతాలకు డీజిల్​, పెట్రోల్​ను ట్యాంకర్​ల ద్వారా సరఫరా చేస్తోంది. అయితే స్థానిక యువకులు పెద్ద పెద్ద బకెట్​లతో ఆ ట్యాంకర్​ల సీల్ కట్ ​చేసి ఆయిల్​​ను ఎత్తుకెళ్తున్నారు. వారు దొంగతనం చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న బిహార్​ పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. చోరీకి గురవుతున్న ఆయిల్ విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.