ఆస్పత్రిలో అర్ధరాత్రి బర్త్‌డే పార్టీ.. బెల్టులతో కొట్టుకుంటూ అల్లరి! - ఆస్పత్రిలో బర్త్‌డే
🎬 Watch Now: Feature Video
ఆస్పత్రిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి యువకులు హల్చల్ చేశారు. పుట్టినరోజు జరుపుకొంటున్న యువకుడిని స్నేహితులు బెల్టులతో కొట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆస్పత్రిలో ఆదివారం అర్ధ రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ యువకుడు ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఫార్మసీలో పనిచేసే అతడి స్నేహితులు బెల్టులతో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఎమర్జెన్సీ విభాగాలు పక్కనే ఉన్నా.. వీరంతా ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన ఆస్పత్రి వైద్యుడు ఆనంద్ ఓఝాన్.. ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST