స్కూటీపై మహిళ.. వేగంగా దూసుకొచ్చిన ఎద్దులు.. మూల మలుపు వద్ద.. - స్కూటీని ఢీకొట్టిన కర్ణాటక
🎬 Watch Now: Feature Video
కర్ణాటక హుబ్లీలో ఓ వేడుకలో భాగంగా నిర్వహించిన ఎడ్లపందేలలో అపశ్రుతి చోటు చేసుకుంది. కుందగోలా తాలుకా గుడగెరి గ్రామంలో ఈ ఉత్సవం కొనసాగుతున్న సమయంలో ఓ మహిళ స్కూటీతో రోడ్డుపైకి వచ్చింది. వేగంగా వచ్చిన ఎడ్లబండి ఒక్కసారిగా ఎడమ మలుపు తీసుకుంది. ఎడ్లబండి మహిళను ఢీకొట్టగా.. ఆమె కిందపడిపోయింది. దీన్ని స్థానికులు ఫోన్లలో బంధించారు. అదృష్టవశాత్తూ బాధితురాలికి తీవ్రగాయాలు కాలేదు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST