కశ్మీర్​లో భారీగా హిమపాతం.. విరిగిపడిన కొండ చరియలు.. రవాణా సేవలకు తీవ్ర ఆటంకం - జమ్ముకశ్మీర్​ లేటెస్ట్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 11, 2023, 4:16 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

కశ్మీర్‌ లోయలో జోరుగా మంచు కురుస్తోంది. ఫలితంగా రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హిమపాతం కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లించారు. మరోవైపు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల రెండ్రోజులుగా జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాంబన్‌ ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, వాహనదారులకు ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్ జాతీయ రహదారిని పునరుద్ధించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.