డ్రైవర్ నిర్లక్ష్యం.. చిన్నారి తలమీదుగా దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే! - పంజాబ్
🎬 Watch Now: Feature Video
పంజాబ్‌లోని లుధియానాలో విషాదం చోటుచేసుకుంది. షాహీద్ కర్నైల్ సింగ్ నగర్లో అక్కతో కలిసి దుకాణానికి వెళ్తున్న ఓ ఏడాదిన్నర చిన్నారి కారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఇంటి ఎదుటే ఉన్న షాప్‌కు వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా కిందపడిపోయింది చిన్నారి. తనను లేపేందుకు ఆమె అక్క ప్రయత్నిస్తుండగానే.. షాప్ ఎదుట ఉన్న కారు.. చిన్నారి తల మీదుగా వెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి మృతదేహాన్ని పట్టుకొని ఆమె తల్లి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నడుపుతున్న వ్యక్తి ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. సత్వరమే నిందితుడిని శిక్షించి పాపకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు సహా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST