కులాల వారీగా కూర్చొని తినండి.. పెళ్లి భోజనాల్లో మైక్‌లో ప్రకటన - వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
పెళ్లి విందులో కులాల వారీగా కూర్చొని తినాలంటూ లౌడ్స్పీకర్లో ప్రకటన చేసిన సంఘటన హిమాచల్‌ప్రదేశ్, సిర్మౌర్ జిల్లాలో జరిగింది. కులం ఆధారంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించిన వీడియోను ఓ యువకుడు ఫేస్బుక్లో పోస్ట్ చేయటం వల్ల.. వైరల్‌గా మారింది. "శిల్లాయీ ప్రాంతంలోని పరిస్థితి ఇది.. కుల వివక్ష, అంటరానితనాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారో చూడండి" అని రాసుకొచ్చాడు అతడు. వీడియోలో.. మైక్‌లో కులాల వారీగా భోజనాలు వడ్డింపుపై ఓ వ్యక్తి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని తీవ్రంగా ఖండించింది దళిత్ శోషణ ముక్తి మంచ్. దర్యాప్తు చేపట్టి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోటా మనాల్ పంచాయతీలో మే 12న ఈ ఘటన జరిగనట్లు ఈటీవీ భారత్‌తో చెప్పాడు వీడియో పోస్ట్ చేసిన యువకుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వీర్ బహదూర్ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST