పాముతో వీరోచితంగా పోరాడి ముగ్గురు పిల్లల్ని కాపాడుకున్న శునకం - ఛత్తీస్‌గఢ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
తన పిల్లలను రక్షించుకునేందుకు పాముతో ఓ కుక్క వీరోచితంగా పోరాడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మర్వాహీలో జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఓ భవనంలో ఓ ఆడ కుక్క మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ నాగుపాము అక్కడికి చేరుకుంది. పాము తన బిడ్డలకు హాని చేస్తుందేమోనని పాము ముందు నిలబడి అరిచింది. పాము కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కుక్క భయపడలేదు. అనంతరం కాసేపటికి పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST