పూరమ్ ఉత్సవాల్లో 'గజరాజు' బీభత్సం.. భక్తులు హడల్ - కేరళ పూరమ్ ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15251838-thumbnail-3x2-elephant.jpg)
Elephant Ruckus Pooram: కేరళలోని త్రిస్సూర్‌లో జరుగుతున్న పూరమ్ ఉత్సవాల్లో ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. మావటి నుంచి తప్పించుకుని హల్చల్ చేసింది. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. అయితే, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే టెంపుల్ ప్రాంగణానికి వెలుపల ఈ సంఘటన జరగటం వల్ల పెను ప్రమాదం తప్పింది. 'పూరమ్ ఉత్సవాలను ప్రారంభించేందుకు కనిమంగళమ్ శస్థవ్ ఊరేగింపు కోసం మచత్ ధర్మాన్ అనే ఏనుగును తీసుకొచ్చారు. ఊరేగింపు మనికండనాలుకు చేరుకున్న తర్వాత ఏనుగు ఇష్టారీతిలో పరుగులు పెట్టింది. అయితే, దేనిని ధ్వంసం చేయలేదు, ఎవరీకి హాని తలపెట్టలేదు. ఆ ప్రాంతంలో తక్కువ మంది ఉండటం వల్ల సులభంగా తప్పించుకోగలిగారు. ఏనుగుల నిర్వహణ బృందం వచ్చి దానిని అదుపు చేశారు.' అని పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST