ఎన్నికల విధుల కోసం సిబ్బంది సాహసం ఈవీఎంలతో సముద్ర ప్రయాణం - గుజరాత్ ఎన్నికల యంత్రాంగం
🎬 Watch Now: Feature Video
డిసెంబర్ 1న జరగబోయే గుజరాత్ ఎన్నికల విధుల కోసం కొందరు సిబ్బంది సాహసం చేశారు. రాజుల నియోజకవర్గంలో ఉన్న షియాల్బెట్ అనే ద్వీపానికి సముద్రంలో ప్రయాణించారు. ఈవీఎంలతో సహా 50 మంది ఎన్నికల యంత్రాంగం చిన్నచిన్న పడవుల్లో ప్రయాణించి మరీ అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ద్వీపంలో 7,700 మంది మత్య్సకార ఓటర్లు ఉండగా 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ ఓట్ల కోసం సముద్రం మధ్యలో ఉన్న నక్క గబ్బిలం దీవికి సిబ్బందితో పాటుగా పోలీసులు కూడా చేరుకున్నారు. పడవలో ప్రయాణించి మరీ ఎన్నికల విధుల్లో పాల్గొనడం చాలా థ్రిల్లింగ్గా ఉందని సిబ్బంది చెప్పారు. గతంలో కూడా సిబ్బంది ఇలానే సముద్రంలో ప్రయాణించి విధుల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST