ఆకాశంలో త్రివర్ణం రెపరెపలు, జాతీయ జెండాతో గాల్లో చక్కర్లు కొట్టిన గద్ద - జాతీయ జెండాతో గాల్లోకి ఎగిరిన గద్ద

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2022, 10:46 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

ఆకాశంలో జాతీయ జెండాను రెపరెపలాడించింది ఓ పక్షి. త్రివర్ణ పతాకంతో గాల్లోకి ఎగిరింది. రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​లో ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న రాణాప్రతాప్ సాగర్ డ్యామ్​పై అధికారులు త్రివర్ణ పతాకాలు ఏర్పాటు చేశారు. కాగా, ఓ గద్ద డ్యామ్​పై వచ్చి వాలింది. పైకి ఎగిరే క్రమంలో అక్కడ ఉన్న ఓ జెండా గద్ద కాళ్లకు చిక్కుకుంది. పక్షి అలాగే ఎగిరేసరికి కింద ఉన్నవారికి గద్ద జెండాను పట్టుకొని గాల్లో చక్కర్లు కొడుతునట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆగస్టు 14న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.