మత్తులో గూడ్స్ ట్రైన్​ పైకెక్కి.. 220 కి.మీ. ప్రయాణం.. పక్క రాష్ట్రానికి వెళ్లాక.. - Traveling on Train Roof

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 9, 2022, 9:59 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Traveling on Goods Train Roof: ఓ యువకుడు బిహార్​లో గూడ్స్ రైలు పైకి ఎక్కి 220 కిలోమీటర్లు ప్రయాణించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. గయాలోని మాన్​పుర్ నుంచి ఝార్ఖండ్​లోని ధన్​బాద్​కు రైలు బోగీ పైన ప్రయాణించి చేరుకున్నాడు. ధన్​బాద్ స్టేషన్​లో అతడిని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది.. కిందకు దించారు. యువకుడిని తునకుప్ప ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదం ఉన్నప్పటికీ యువకుడు క్షేమంగానే బయటపడ్డాడు. దిగేటప్పుడు విద్యుత్ తీగలకు తగిలితే పెద్ద ప్రమాదం జరిగేదని స్టేషన్​లో ఉన్న ఆందోళన చెందారు. ఇటీవలే బిహార్​లో ఓ వ్యక్తి ఇంజిన్ కింద కూర్చొని 190 కి.మీ. ప్రయాణించాడు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.