అపార్ట్‌మెంట్ పక్కన కుంగిపోయిన మట్టి.. గుంతలో పడ్డ కారు.. ప్రమాదంలో 200 కుటుంబాలు! - నిర్మాణ ప్రదేశంలో గుంతలో పడ్డ కారు
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్‌లోని రాంచీలో ఓ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో మట్టి కుంగిపోవడం వల్ల పక్కనే ఉన్న కారు గుంతలో పడి భయాందోళన రేపింది. మెరబాది మైదానంలో ఓ అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా ఆకస్మాత్తుగా మట్టికోతకు గురై కారు గుంతలో పడిపోయింది. భారీ గుంత పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌కు పగుళ్లు ఏర్పడడం వల్ల కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బిల్డర్ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల 200 కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయిని అపార్ట్‌మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్ అక్రమంగా నిర్మాణం చేస్తున్నాడని కొంతమంది అధికారులు దానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST