తెరుచుకున్న కేదార్​నాథ్​ ఆలయం.. మోదీ తొలిపూజ! - బద్రినాథ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 6, 2022, 8:37 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

kedarnath: ఉత్తరాఖండ్​లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్​నాథ్​ ఆలయం ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. శుక్రవారం ఉదయం 6.25 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. అంతకుముందు ప్రధాన పూజారి నివాసం నుంచి కేదార్​నాథుడి డోలీని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి 20వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి హాజరయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తరఫున తొలి పూజ చేశారు అర్చకులు. హర్​ హర్​ మహాదేవ్​ నినాదాలతో ధామ్​ ప్రతిధ్వనించింది. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు. చార్​ధామ్​ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈనెల 3వ తేదీనే తెరుచుకున్నాయి. బద్రినాథ్​ ఆలయం ఈనెల 8వ తేదీన తెరవనున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.