సెల్​ఫోన్​ దొంగకు రోడ్డుపైనే చుక్కలు చూపించిన మహిళ - రాజస్థాన్‌లో దొంగతనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 7, 2022, 6:21 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

రాజస్థాన్‌లోని జైపుర్​లో మిట్టమధ్యాహ్నం ఓ దొంగ మహిళ చేతి నుంచి మొబైల్‌ కాజేయబోయి అడ్డంగా దొరికాడు. రహదారిపై మహిళ నడుస్తూ ఉండగా ఆమె వెనకాలే వెళ్లిన దొంగ సెల్​ఫోన్​ లాక్కున్నాడు. అయితే ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించగా అదుపు తప్పి కిందపడ్డాడు. ఆ లోపే అక్కడకు వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.