వందేళ్ల నాటి 110 మీటర్ల పొడవైన చిమ్నీ కూల్చివేత - అత్యంత పొడవైన చిమ్నీ కూల్చివేత
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్ జంషెడ్‌పుర్‌లోని టాటా స్టీల్ ప్లాంట్‌లో 110 మీటర్ల పొడవైన చిమ్నీని కూల్చివేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ సహకారంతో కూల్చివేత కార్యక్రమం చేపట్టినట్లు టాటా స్టీల్ ప్లాంటు వర్గాలు తెలిపాయి. 11 సెకన్లలో కూల్చివేత పూర్తయినట్లు పేర్కొన్నాయి. అంతకుముందే ఆ పరిసర ప్రాంతాల్లోని వారిని అక్కడి నుంచి తరలించినట్లు టాటా స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు తెలిపారు. శతాబ్దం క్రితం స్థాపించబడిన ఈ ప్లాంటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల చిమ్నీ అవసరం లేనందున దాన్ని కూల్చేసినట్లు టాటా స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు వివరించారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST