Best Scooters For College Students : మీరు కాలేజ్ స్టూడెంట్సా? రూ.1 లక్ష బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని ఆశపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో చాలా బ్రాండెడ్ స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అదిరిపోయే డిజైన్‌తో, లేటెస్ట్ ఫీచర్స్ & స్పెక్స్ ఉండి, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్-5 స్కూటీల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
5. TVS Ntorq 125 : కాలేజీ విద్యార్థులకు బాగా ఉపయోగపడే ఎంట్రీ లెవల్ స్కూటీల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఒకటి. ఈ స్కూటీలో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9.25 bhp పవర్, 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఇది దాదాపుగా 48.5 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటీ 5 వేరియంట్లలో, 12 రంగుల్లో లభిస్తుంది.
TVS Ntorq 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటీ ధర సుమారుగా రూ.94,187 - రూ.1,09,751 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
4. Yamaha Ray ZR 125 : ఈ యమహా రే జెడ్ఆర్ 125 బైక్‌లో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.04 bhp పవర్, 10.3 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఇది దాదాపుగా 49 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ కూడా కాలేజ్ విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఇది 3 వేరియంట్లలో, 11 కలర్స్‌లో లభిస్తుంది.
Yamaha Ray ZR 125 Price : మార్కెట్లో ఈ యమహా బైక్ ధర సుమారుగా రూ.87,080 - రూ.1,00,255 వరకు ఉంటుంది.
3. Hero Xoom : ఇండియన్ మార్కెట్లో ఉన్న బెస్ట్ స్కూటీల్లో హీరో జూమ్ ఒకటి. ఈ బైక్‌లో 110.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.05 bhp పవర్, 8.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది దాదాపుగా 53.4 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటీ 4 వేరియంట్లలో, 6 అందమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది
Hero Xoom Price : మార్కెట్లో ఈ హీరో జూమ్ బైక్ ధర సుమారుగా రూ.75,656 - రూ.85,945 వరకు ఉంటుంది.
2. Suzuki Burgman Street : కాలేజ్‌కు వెళ్లే విద్యార్థులకు సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ బైక్‌లో 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.58 bhp పవర్, 10 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది దాదాపుగా 58.5 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటీ 3 వేరియంట్లలో, 13 కలర్స్‌లో లభిస్తుంది.
Suzuki Burgman Street Price : మార్కెట్లో ఈ సుజుకి బైక్ ధర సుమారుగా రూ.96,804 - రూ.1,17,204 వరకు ఉంటుంది.
1. Honda Dio 125 : భారత్‌లోని బెస్ట్ టూ-వీలర్స్‌లో హోండా డియో ఒకటి. ఈ బైక్‌లో 123.92 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.16 bhp పవర్, 10.4 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది దాదాపుగా 48 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ 2 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది.
Honda Dio 125 Price : మార్కెట్లో ఈ హోండా బైక్ ధర సుమారుగా రూ.87,458 - రూ.94,423 వరకు ఉంటుంది.
రూ.90వేల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే!
రూ.1.5 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే!