ETV Bharat / offbeat

క్రిస్పీ అండ్​ టేస్టీ "ఆనియన్​ బోండా" - ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే వేడివేడిగా తినొచ్చు! - ONION BONDA IN TELUGU

- ఈవెనింగ్ స్నాక్​ గా సూపర్ అప్షన్

Onion Bonda
Onion Bonda Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 4:35 PM IST

Onion Bonda Recipe : చాలా మందికి సాయంత్రం టీ టైమ్​లో.. సమోసా, మిర్చీ బజ్జీ, ఉల్లి పకోడి ఇలా ఏదైనా స్నాక్​ తినాలనిపిస్తుంది. కాస్త కారంగా స్నాక్ తిని టీ/కాఫీ తాగితే ఆ ఫీల్​ వేరేలా ఉంటుంది. మీరు కూడా ఇలానే ఇంట్లో ఈవెనింగ్​ రకరకాల స్నాక్స్​ ట్రై చేస్తుంటారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! ఇప్పుడు మనం 10 నిమిషాల్లోనే ఉల్లి బోండాలను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఆనియన్ బోండా చేస్తే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్​గా చాలా రుచికరంగా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఉల్లి బోండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెరుగు-కప్పు
  • గోధుమ పిండి-అర కప్పు
  • బియ్యం పిండి-పావుకప్పు
  • అరకప్పు- గోధుమ రవ్వ
  • ఉప్పు రుచికి సరిపడా
  • బంగాళాదుంపలు-2
  • పచ్చిమిర్చి-4
  • ఉల్లిపాయలు-2
  • కరివేపాకు-2
  • జీలకర్ర-టీస్పూన్​
  • కొత్తిమీర-కొద్దిగా
  • అల్లం ముక్కలు- 2 చిన్నవి
  • వంటసోడా-చిటికెడు

తయారీ విధానం :

  • ముందుగా బంగాళదుంపలను నీటిలో శుభ్రం చేసి.. పైన పొట్టు తీసేసుకోవాలి. ఆపై సన్నని ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి.
  • అల్లం, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో పెరుగు, బంగాళాదుంప ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • తర్వాత ఇందులోనే గోధుమ పిండి, బియ్యం పిండి వేసుకుని మరోసారి గ్రైండ్​ చేసుకోవాలి. (పిండి అవసరాన్ని బట్టి గ్రైండ్​ చేసేటప్పుడు కొన్ని నీళ్లు పోసుకోవాలి. గోధుమపిండికి బదులుగా మైదా పిండి కూడా ఉపయోగించుకోవచ్చు.)
  • ఇప్పుడు మిక్సీలోని పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో గోధుమ రవ్వ వేసి బాగా మిక్స్​ చేయండి.
  • తర్వాత అల్లం తురుము, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలపండి.
  • ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంటసోడా వేసి పిండిని మిక్స్​ చేయండి.
  • ఆపై ఉల్లి బోండా వేయించడం కోసం.. స్టౌపై కడాయి పెట్టి నూనె పోయండి. నూనె వేడయ్యాక ఎగ్​ బోండా చిన్నవిగా వేసుకోండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి బోండాలను దోరగా వేయించుకోండి.
  • అంతే ఇలా ఉల్లి బోండాలు చేసుకుంటే కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ బోండాలు పల్లీ చట్నీ, టమాటా చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి.
  • నచ్చితే ఉల్లి బోండాలను మీరు కూడా ఇలా ట్రై చేయండి.

చల్లటి సాయంత్రం వేళ కమ్మటి "ఎగ్​ బోండా"- సింపుల్​గా ఇంట్లో చేసేయండిలా!!

మైసూర్ బోండాకు హోటల్ రుచి రావట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే అమోఘమైన టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.