ETV Bharat / bharat

మణిపుర్‌ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమీక్ష - AMIT SHAH REVIEWS MANIPUR SECURITY

మణిపుర్‌ పరిస్థితులపై అమిత్‌ షా సమీక్ష - శాంతిస్థాపనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

Amit Shah
Amit Shah (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 8:12 PM IST

Amit Shah Reviews Manipur Security : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మళ్లీ నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై కేంద్ర హోంశాఖ అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన అమిత్​ షా మణిపుర్‌లో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని దిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్‌ షా సమావేశాన్ని నిర్వహించారు.

మద్దతు ఉపసంహరించుకున్న ఎన్​పీపీ
మరోవైపు బీజేపీ నేతృత్వంలోని మణిపుర్‌ సర్కార్​కు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ- ఎన్​పీపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్​పీపీ లేఖ రాసింది. మణిపుర్‌లో శాంతిభద్రతల సంక్షోభాన్ని పరిష్కరించడంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేఖలో పేర్కొంది. హింసాత్మక ఘటనల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అందుకే తమ మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. మణిపుర్‌ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా 53 స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఇందులో 'ఎన్​పీపీ'కి 7 సీట్లు ఉన్నాయి.

ఇదీ జరిగింది!
మైతేయ్‌-కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపుర్‌ మళ్లీ అట్టుడుకుతోంది. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు ఆరుగురిని హత్య చేసి నదిలో పడేయడంతో భారీస్థాయిలో హింస రాజుకుంది. ఆందోళనకారులు సీఎం బీరేన్‌ సింగ్‌ వ్యక్తిగత నివాసంపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను భద్రత బలగాలు భగ్నం చేయడంతో మరింతరెచ్చిపోయిన నిరసనకారులు ఇంఫాల్‌ లోయలోని ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పంటించారు. బీజేపీకి చెందిన ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు తెగబడిన ఆందోళనకారులు అనంతరం వారి ఇళ్లకు నిప్పంటించారు. వారి ఇళ్లల్లోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామగ్రిని తగలబెట్టారని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేరని చెప్పారు. ఈ ఘటనలో వారి ఇళ్లు పాకిక్షంగా కాలిపోయినట్లు తెలిపారు.

ఏ క్షణం ఏమౌతుందో?
ఇంఫాల్‌ లోయలోని 5 జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇంఫాల్‌లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్‌నెట్‌ సేవలనూ నిలిపివేశారు. అటు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్‌ షా మహారాష్ట్రలోని తన ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన దిల్లీకి వెళ్లి మణిపుర్‌ పరిస్థితిని సమీక్షించారు. దీనితో పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశాయి. మణిపుర్‌ రాష్ట్ర సచివాలయం, ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీస్థాయిలో భద్రత బలగాలు మోహరించాయి. మరోవైపు 24 గంటల్లో సాయుధ మిలిటెంట్‌ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మైతేయి సంఘాలు మణిపుర్‌ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.