పెళ్లి దుస్తులతో ఓటేసేందుకు వధువు.. అధికారుల సాయంతో అవిభక్త కవలలు - పంజాబ్‌లో పోలింగ్
🎬 Watch Now: Feature Video
యూపీ, పంజాబ్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేయడానికి అన్ని వయసులవారు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో ఓ నవవధువు పెళ్లి బట్టలతో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. శనివారం రాత్రి పెళ్లి జరగ్గా.. ఓటు వేసి.. అత్తమామల ఇంటికి బయలుదేరింది ఆమె. పంజాబ్‌లో అవిభక్త కవలలు సోహ్నా, మోహ్నాలు కూడా తమ బాధ్యతను మరవలేదు. ఇబ్బంది అనిపించినా.. అధికారులు, స్థానికుల సాయంతో తమ హక్కును వినియోగించుకునేందుకు అమృత్సర్ జిల్లా మన్వాల్ ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేశారు. శరీరం ఒకటైనా.. వీరిని ఇద్దరు ఓటర్లుగా పరిగణించారు అధికారులు. ఓటు వేయడాన్ని బాధ్యతగా అనుకొని.. హక్కును వినియోగించుకున్న నవవధువు, అవిభక్త కవలలను అధికారులు అభినందించారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST