పైనుంచి రైలు.. ట్రాక్ మధ్యలో నక్కి బాలికను కాపాడిన యువకుడు - గూడ్స్ రైలు కిందపడిన అమ్మాయిన కాపాడిన యువకుడు
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్‌లోని భూపాల్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోబోతున్న బాలిక ప్రాణాలను కాపాడాడు. 17 ఏళ్ల అమ్మాయి చనిపోవాలని భోపాల్‌లోని బర్ఖేడీ గేట్ సమీపంలో ఉన్న ట్రాక్ వద్దకు వెళ్లింది. గూడ్సు రైలు వస్తున్నప్పుడు పట్టల మీద పడింది. దీనిని గమనించిన మెహబూబ్ అనే యువకుడు ఆమెను ట్రాక్ పై నుంచి జరిపి మధ్యలోకి తీసుకువచ్చాడు. దీంతో ఆ గూడ్స్ రైలు వారి పైన నుంచి పోయింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి బాలికను కాపాడిన యువకుడిని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST