భుజాలపై కుమారుడి శవం.. గుండె నిండా దుఃఖం.. అర కిలోమీటరు నడుస్తూ... - ఒడిశా రాయగడ జిల్లా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 21, 2022, 6:54 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Father Carries Son Dead Body: ఒడిశా రాయగడ జిల్లా హరిజన్​ సాహి ప్రాంతంలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. కుమారుడి మృతదేహాన్ని భుజంపై మోస్తూ ఓ తండ్రి అర కిలోమీటరు నడిచాడు. మృతదేహాన్ని తరలించేందుకు వాహనాలు లేకపోవడమే ఇందుకు కారణం. అనారోగ్యంతో ఉన్న తొమ్మిదేళ్ల ఆకాశ్​ బనియాను అతని తండ్రి సుర్ధార్​ బనియా ఆదివారం రాత్రి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. కానీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించడం వల్ల మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని భావించాడు. కానీ ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోయేసరికి భుజాలపైనే మోసుకెళ్లాడు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.