కెనడాలో భారీగా ఆస్తులు స్విస్ బ్యాంక్లో అకౌంట్ గురించి షాకింగ్ లెక్కలు చెప్పిన సీనియర్ నటుడు - అలీతో సరదాగా నరసింహరాజు ప్రేమ
🎬 Watch Now: Feature Video
తెలుగు తెరపై జానపద కథానాయకుడిగా పేరు పొందారు సీనియర్ నటుడు నరసింహరాజు. వెండితెరతో పాటు బుల్లితెరపై మెరిశారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ పోషించిన అనుకోని ప్రయాణం అనే సినిమాతో చాలా కాలం తర్వాత ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సీనియర్ నటుడు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అలీతో సరదాగా టాక్ షోకు వచ్చిన ఆయన కెనడాలో ఉన్న భారీ ఆస్తులపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఎలా వచ్చాయో చెప్పారు. సినిమాల్లో తన ప్రయాణం 51ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిందని అయితే అవకాశాలు ఆ రోజు నుంచి ఆగిపోయాయని దాని కారణాలు ఏంటో వివరించారు. ఈ షోకు నరసింహరాజుతో పాటు అలనాటి అందాల తార ప్రేమ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా అనుకోని ప్రయాణం అక్టోబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST