భరతనాట్యం చేస్తూనే మృత్యు ఒడికి.. కుమార్తె కళ్లెదుటే... - నాట్యం చేస్తూ మృతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14835399-thumbnail-3x2-dancer.jpg)
కుమార్తెతో కలిసి భరతనాట్యం చేస్తూనే గుండెపోటుతో మరణించారు ఓ కళాకారుడు. ఈ విషాద ఘటన తమిళనాడు మదురైలో జరిగింది. పంగుని ఉతిర పండుగ సందర్భంగా ఓ ఆలయం వద్ద ప్రముఖ భరతనాట్య గురువు కాళిదాస్(54)తో ప్రదర్శన ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కుమార్తె సహా మరికొందరితో కలిసి నాట్యం చేస్తున్న ఆయనకు అలసటగా అనిపించింది. పక్కకు వచ్చేసి కుర్చీలో కూర్చుని, నీళ్లు తాగారు. ప్రదర్శన పూర్తయినా స్పందించలేదు. 'డాడీ.. డాడీ' అంటూ వాళ్ల అమ్మాయి పిలిచినా పలకలేదు. చివరకు.. కాళిదాస్ మరణించారని తెలుసుకుని అంతా విషాదంలో మునిగిపోయారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST