ETV Bharat / sukhibhava

టీబీ ప్రభావం ఆ మహిళల్లోనే ఎక్కువ.. అసలు వాస్తవాలేమిటి? - world tuberculosis day

కరోనా వచ్చాక ప్రస్తుతం అదే మనకు బద్ధ శత్రువనిపిస్తోంది. కానీ మన ఆరోగ్యానికి అంతకంటే పెద్ద పెద్ద శత్రువులు చాలానే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. టీబీ (ట్యూబర్‌క్యులోసిస్‌/క్షయ) కూడా అలాంటిదే! మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియం కారణంగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అక్కడితో ఆగకుండా మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు.. వంటి అవయవాలకూ ఇది విస్తరిస్తుందట!

tb disease, world  tuberculosis day
టీబీ వ్యాధిపై కథనం
author img

By

Published : Mar 26, 2021, 11:42 AM IST

టీబీ అంటే సాధారణంగా వచ్చే దగ్గే కదా అని దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏటా సుమారు 4.8 లక్షల మంది భారతీయులు దీనికి బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పునరుత్పత్తి వయసులో (20-45 ఏళ్ల మధ్య) ఉన్న మహిళలపై దీని ప్రభావం అధికంగా ఉందట! అలాగని భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే దీన్ని నయం చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా ఈ భయాన్ని పోగొట్టాలంటే ఈ సమస్యపై నెలకొన్న కొన్ని అపోహల్ని జయించాలంటున్నారు. నేడు ‘ప్రపంచ ట్యూబర్‌క్యులోసిస్ డే’ సందర్భంగా టీబీపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..

గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఈ సమస్య కారణంగా ఒక్క 2014లోనే 4 లక్షల మందికి పైగా మహిళలు మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.. ఇక వీరిలో హెచ్‌ఐవీ ఉన్న వారే 1.4 లక్షల మందికి పైగా ఉండడం గమనార్హం. ఇదొక్కటనే కాదు.. మధుమేహం, కిడ్నీ సమస్యలు, పోషకాహార లోపం, కొన్ని రకాల క్యాన్సర్లు.. వంటి సమస్యలున్న వారిలోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు.

లక్షణాలివే!

tbsymtopsandprecautions650-2.jpg
లక్షణాలివే!

క్షయ ఉన్న వారు తమ సమస్యను కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా గుర్తించచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

  • రెండు మూడు వారాల పాటు నిరంతరాయంగా దగ్గడం. ఈ క్రమంలో దగ్గుతో పాటు రక్తం, శ్లేష్మం కనిపించడం.
  • దగ్గినప్పుడు లేదంటే విశ్రాంతిలో ఉన్నా కూడా ఛాతీలో నొప్పి రావడం.
  • రాత్రుళ్లు విపరీతంగా చెమట పట్టడం
  • బాగా నీరసంగా, అలసటగా అనిపించడం
  • సాయంత్రం, రాత్రి పూట జ్వరం రావడం
  • ఆకలి మందగించడం
  • బరువు తగ్గడం
  • వెన్నెముక, కీళ్లలో నొప్పి
  • మూత్రంలో రక్తం కనిపించడం.. మొదలైనవి

అపోహలు-వాస్తవాలు!

  • టీబీ ఇన్ఫెక్షన్‌ క్రమంగా వ్యాధికి దారితీస్తుంది.

టీబీ ఇన్ఫెక్షన్‌ వచ్చిన ప్రతి ఒక్కరూ తీవ్ర అనారోగ్యానికి గురికారు అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇందులో రెండు రకాల దశలుంటాయట! మొదటిది లాటెంట్‌ టీబీ ఇన్ఫెక్షన్‌.. రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్న వారు ఈ ఇన్ఫెక్షన్‌ను సమర్థంగా ఎదుర్కోగలరు. తద్వారా దీనికి ఆదిలోనే చెక్‌ పెట్టేయచ్చు. అదే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో ఈ లాటెంట్‌ టీబీ ఇన్ఫెక్షన్‌ క్రమంగా టీబీ వ్యాధికి దారితీస్తుందట! దీన్ని యాక్టివ్‌ టీబీ అంటారు. ఈ దశలో ఉన్న వారి నుంచి ఇతరులకు టీబీ సోకే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే వీరు సుమారు రెండు వారాల పాటు సరైన చికిత్స తీసుకుంటూ, వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే క్రమంగా కోలుకుంటారని చెబుతున్నారు.

tbsymtopsandprecautions650-3.jpg
బీ వంశపారంపర్యంగా వస్తుందా?
  • టీబీ వంశపారంపర్యంగా వస్తుంది.

ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య కాదంటున్నారు నిపుణులు. ఇది ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. యాక్టివ్ టీబీ ఉన్న వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చివరికి నవ్వినా, గట్టిగా పాటలు పాడినా.. ఇలా ఎప్పుడైతే వారి నోటి నుంచి తుంపర్లు గాల్లోకి ప్రవేశించినప్పుడు, వాటిని పీల్చిన వారికి ఇది సులభంగా వ్యాపించే అవకాశం ఉందట. అంతేతప్ప ఇది వంశపారంపర్యంగా వస్తుందని చెప్పలేం అంటున్నారు నిపుణులు.

అలాగని టీబీ ఉన్నవారు దగ్గినంత మాత్రాన, తుమ్మినంత మాత్రాన ఇతరులకు వెంటనే టీబీ సోకదు. టీబీ ఉన్నవారికి దగ్గరగా ఎక్కువసేపు ఉండడం, వారితో కలిసి ఎక్కువసేపు గడపడం వల్ల వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మొదలైన సందర్భాలలో వారితో బాగా సన్నిహితంగా ఉండేవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో టీబీ ఉన్న వారితో ఎక్కువ సమయం లేదా ఎక్కువ రోజుల పాటు కలిసి గడిపిన వారికి ఇది వేగంగా విస్తరిస్తుందంటున్నారు నిపుణులు.

  • ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల మాత్రమే టీబీ వస్తుంది

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు - మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియం కారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. అయితే- సాధారణంగానే పొగ తాగేవారిలో వివిధ రకాల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో- పొగ తాగడం వల్ల టీబీ వచ్చే రిస్క్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. అందువల్ల సాధ్యమైనంతవరకు స్మోకింగ్కి‌ దూరంగా ఉండడం అన్ని విధాలుగానూ మంచిది.

tbsymtopsandprecautions650-1.jpg
ఈ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులనే లక్ష్యంగా చేసుకుంటుంది
  • ఈ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులనే లక్ష్యంగా చేసుకుంటుంది.

ఇది ముమ్మాటికీ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది ముందుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపినప్పటికీ.. క్రమంగా లింఫ్‌ నోడ్స్‌కి విస్తరించి.. ఎముకలు, కీళ్లు, మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు.. వంటి అవయవాలకు విస్తరిస్తుందట! ఇక మధుమేహం, కిడ్నీ సమస్యలు, పోషకాహార లోపం, కొన్ని రకాల క్యాన్సర్లు, హెచ్‌ఐవీ.. వంటి సమస్యలున్న వారిలో దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పునరుత్పత్తి వయసులో (20-45 ఏళ్ల మధ్య) ఉన్న మహిళల్లోనే దీని ప్రభావం ఎక్కువట!

  • సాధారణ రక్తపరీక్ష ద్వారా టీబీని గుర్తించచ్చు.

కేవలం రక్త పరీక్ష, రేడియోలాజికల్‌ పరీక్షల ద్వారా వంద శాతం టీబీ నిర్ధారణ కాదు. వీటితో పాటు స్పూటమ్‌ టెస్ట్‌, ఎక్స్‌రే, పీపీడీ స్కిన్‌ టెస్ట్‌.. వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యను సులభంగా, కచ్చితంగా గుర్తించడం వీలవుతుందంటున్నారు నిపుణులు.

tbsymtopsandprecautions650-4.jpg
టీబీ వచ్చిందంటే ఇక నయం కాదు
  • టీబీ వచ్చిందంటే ఇక నయం కాదు.

ఆదిలోనే గుర్తిస్తే చక్కటి ట్రీట్‌మెంట్‌ ద్వారా టీబీ నుంచి పూర్తిగా బయటపడచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో యాంటీ టీబీ మందులు ఎప్పటినుంచో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని, నిపుణుల సలహా మేరకు వాటిని 6-8 నెలల పాటు వాడితే ఇది పూర్తిగా నయమవుతుందంటున్నారు. అలాగని ఈ చికిత్స మరీ అంత ఖర్చుతో కూడుకున్నది కూడా కాదట! ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఒకసారి టీబీ వచ్చి తగ్గింది కదా.. ఇక మళ్లీ రాదు అనుకోవడానికి వీల్లేదు.. ఎందుకంటే తిరిగి దీని బారిన పడే అవకాశాలు రెండు శాతం ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ఇలా ఈ సమస్యకు సరైన చికిత్స తీసుకుంటూ.. దగ్గినప్పుడు-తుమ్మినప్పుడు చేతిరుమాలు/మాస్క్‌ అడ్డుపెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇతరులకు దూరంగా ఉండడం.. వంటివి చేస్తే ఇటు టీబీ ఉన్నవారు సమస్య నుంచి సులభంగా బయటపడచ్చు.. అలాగే వారి వల్ల ఇతరులకూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడచ్చు..!

ఇదీ చూడండి: ఈ ఇంటి వయసు 200 ఏళ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.